యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభం అప్పుడే..!

by Shyam |   ( Updated:2021-03-13 07:45:28.0  )
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభం అప్పుడే..!
X

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నూతన ప్రధాన ఆలయం పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నూతన ప్రధాన ఆలయం ఇప్పటికీ దాదాపు 90 శాతం పూర్తయింది. దాదాపు 150 కోట్లతో గండి చెరువు సమీపంలో కల్యాణకట్ట, అన్నదాన సత్రం, బస్టాండ్, బస్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్, అన్నదాన సత్రం, దీక్ష పరుల మండపం నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నిర్మాణాల పనులను ఐటీడీఏ అధికారులు వేగవంతం చేశారు. లక్ష్మీనరసింహస్వామి వారి దీక్ష పరులకు ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాద విక్రయశాలలో అధునాతన టెక్నాలజీ మిషనరీలతో లడ్డూ పులిహోర ప్రసాదాలను అందించాలని అధికారులు యోచిస్తున్నారు. దానికి అనుగుణంగా చేపట్టిన ప్రసాద విక్రయశాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.

పది కేజీల బంగారంతో ఆలయం బంగారుమయం:

నూతన ప్రధానాలయాన్ని బంగారుమయం చేయడానికి యాదాద్రి దేవస్థానం రెండు కేజీల బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగించింది. స్వయంభూ మూర్తుల కవచాలు, ధ్వజస్తంభం, సుదర్శన చక్రం, ప్రధాన ఆలయ ద్వారాలకు బంగారు తాపడం వంటి వాటికి ఈ బంగారాన్ని వినియోగించనున్నారు.

Advertisement

Next Story