- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ మార్కెట్లోకి షివోమీ ల్యాప్‌టాప్?
కరోనా పాండమిక్ కారణంగా దాదాపు 80 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ల్యాప్‌టాప్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కష్టం. ఇదే మంచి తరుణంగా తీసుకుని షివోమీ కంపెనీ భారత మార్కెట్లో ఎంఐ బ్రాండ్ ల్యాప్‌టాప్‌ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. షివోమీ 2020 ప్లాన్‌లో భాగంగా భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్తగా ఎంఐ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 2, ఎంఐ బాక్స్ 4కే వంటి చాలా ఐవోటీ పరికరాలను షివోమీ విడుదల చేసింది.
ల్యాప్‌టాప్‌ను విడుదల చేస్తున్నదని క్లూ ఇస్తూ షివోమీ తమ ట్విట్టర్ ఖాతాలో ఒక టీజర్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో షివోమీ కంపెనీ ఇతర ల్యాప్‌టాప్ కంపెనీలైన డెల్, ఏసర్, హెచ్‌పీ, లెనోవోలకు హలో అని చెప్పడం చూడొచ్చు. దీన్ని బట్టి త్వరలోనే ఎంఐ నోట్‌బుక్‌ని విడుదల చేయనుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీన్ని రెడ్‌మీ నోట్‌బుక్ అని కాకుండా ఎంఐ పేరుతోనే బ్రాండింగ్ చేయబోతున్నట్లు సమాచారం.