- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు మాజీ ఎంపీ కవిత విజ్ఞప్తి
దిశ, వెబ్ డెస్క్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారిపై పోరాటంలో సైనికుల్లా పని చేస్తున్నారు పోలీసులు, పారిశుధ్య, వైద్య సిబ్బంది. వారితో సమానంగా 24/7 కరోనాపై జర్నలిస్టులూ పోరాడుతున్నారు. కొవిడ్‌పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, న్యూస్, అప్‌డేట్లు అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారు జర్నలిస్టులు. ఈ క్రమంలో 50 మందికిపైగా జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
జర్నలిస్టు సోదరులకు పలు సూచనలతో విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ముంబైలో జర్నలిస్టులకు కరోనా(కొవిడ్ 19) పాజిటివ్ రావడం దురదృష్టకరం.. విచారకరం.. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న జర్నలిస్టు సోదరులు మీరు జాగ్రత్త. వార్తలను మాకు అందించే క్రమంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, కుటుంబాలను కూడా కాపాడుకోండి’ అంటూ కవిత విన్నవించారు.
Tags: ex mp kavita, request, be safe, journalst, maharashtra state, covid 19