WTC Final.. పట్టుదలతో ఉన్న భారత బౌలర్లు

by Shyam |
WTC Final.. పట్టుదలతో ఉన్న భారత బౌలర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రికెట్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌ వేదికగా న్యూజీలాండ్-టీమిండియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న జట్లు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత కీలక బౌలర్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్‌పై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

టెస్టు సిరీస్‌తో ఆటగాళ్లలో మానసిక సామర్థ్యం

టెస్టు క్రికెట్ అనేది ఆటగాళ్ల ప్రతిభకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. అందులో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ చాలా గొప్పదని భారత స్పిన్నర్ అశ్విన్ తెలిపాడు. ఈ సిరీస్ ఆటగాళ్లలో మానసిక సామర్థ్యాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత ఒక గొప్ప సిరీస్ ఆడబోతున్నామని.. ఫైనల్ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాం.. అశ్విన్, భారత స్పిన్నర్

కరోనా కొత్త రూల్స్‌తో ఒత్తిడి.. అయినా..

వరల్డ్ టెస్టు సిరీస్ టీమిండియాకు ప్రాక్టికల్ జర్మీ మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగ ప్రయాణం.. వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లాగే డబ్య్లూటీసీ ఫైనల్‌‌ను సమానంగా భావిస్తున్నాం.. కరోనా ఐసీసీ క్రికెట్‌లో కీలక మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్‌తో ఆటగాళ్లపై ఒత్తిడి కూడా పెరిగింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా టూర్‌లో సీనియర్ ఆటగాళ్లు లేకున్న యువ బౌలర్లు నెట్టుకొచ్చారు. వారు టీమిండియాలో స్ఫూర్తిని నింపారు. ఎటువంటి ఒత్తిడిలోనైనా రాణించగలమనే నమ్మకం పెరిగింది. ఇదే ఫామ్‌ను డబ్య్లూటీసీ ఫైనల్‌‌లో కొనసాగిస్తాం. ఇషాంత్ శర్మ, భారత ఫేస్ బౌలర్

ఆత్మవిశ్వాసమే మా బలం

ఆత్మ విశ్వాసమే ఆటగాళ్లకు ప్రధాన బలం. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌ రావడం కోసం రెండేళ్లు తీవ్రంగా శ్రమించింది. ఇంకా ఫోకస్ పెడుతాం. ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్‌లో అరంగేట్రం ఆటగాళ్లు అదరగొట్టారు. కొత్త ఆటగాళ్ల పర్ఫామెన్స్‌ జట్లులో సీనియర్లకు మరింత విశ్వాసం పెంచింది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి.. అందుకే వ్యక్తిగతంగా బౌలింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాం.. ఈ విషయంలో టీమిండియా బ్యాట్స్‌మాన్‌, బౌలర్లు ఎక్కడా తగ్గడం లేదు.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్‌ ఫైనల్స్ మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడుతాం.. మహ్మద్ షమీ, భారత్ ఫేస్ బౌలర్

Advertisement

Next Story