హరీష్ రావు త్వరగా కోలుకోవాలని దర్గాలో పూజలు..!

దిశ, సిద్దిపేట:

సిద్దిపేట ప్రజల గుండె చప్పుడు, ఆపద్బాంధవుడు, మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పట్టణ టీఆర్ఎస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం బందారం గ్రామంలోని దర్గాలో భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించారు. అనంతరం ధువా చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు అక్బర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా కరోనా వ్యాధి కష్టాల నుండి హరీష్ రావు ఎంతో మందిని రక్షించారని అన్నారు. ఆయనతో పాటు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించామని అన్నారు.

Advertisement