- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WHO: రెట్టింపు వేగంతో దూసుకొస్తోన్న మరో కొత్త వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులాగా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 70 దేశాలకు పాకి ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ మంకీ పాక్స్ కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది మృతిచెందారు. మహమ్మారి వ్యాప్తిని పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్‌వో ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ వ్యాధికి వాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయని.. దీని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు అభ్యర్థించాయని డబ్ల్యూహెచ్‌వో గుర్తుచేసింది.
కాగా, ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరప్‌లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తరువాత WHO ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్‌ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ.. క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.