Gaza issue: నెతన్యాహుతో ఫోన్ కాల్ మాట్లాడిన ట్రంప్

by Harish |
Gaza issue: నెతన్యాహుతో ఫోన్ కాల్ మాట్లాడిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌ కాల్ మాట్లాడినట్లు సంబంధిత వర్గాల వారు తెలిపారు. ఈ కాల్‌లో గాజాలో కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నెతన్యాహును ట్రంప్ కోరినట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ ప్రచారం బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా అధ్యక్షడు బైడెన్ కూడా హమాస్-ఇజ్రాయెల్ రెండు కూడా తమ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తక్షణం కాల్పులను విరమించి రెండు వర్గాలు కూడా బందీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందానికి రావాలని నెతన్యాహుపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తనవంతుగా గాజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతకుముందు నెతన్యాహు అమెరికాను సందర్శించినప్పుడు అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. అప్పుడు కూడా గాజా కాల్పుల విరమణ చర్చలను ప్రారంభించాలని ట్రంప్, నెతన్యాహుకు సూచించారు.

Advertisement

Next Story