- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ హయాంలో ప్రపంచం సురక్షితంగా ఉంది: బ్రిటన్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపునకు బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మద్దతిచ్చారు. ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ప్రపంచం సురక్షితంగా ఉందని తెలిపారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో భాగంగా మాట్లాడారు. ఇరాన్, చైనా పట్ల ట్రంప్ దూకుడుగా ఉండేవారని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు ట్రంప్ మద్దతివ్వడం కూడా ప్రశంసనీయమని కొనియాడారు. ట్రంపు కార్యక్రమాలన్నింటినీ ఏకీభవించకపోయినప్పటికీ..ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రం ప్రపంచం సేఫ్‌గా ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. దూకుడు పాలన విస్తరించకుండా ట్రంప్ నియంత్రించే వారని చెప్పారు. 2020లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే బ్రిటన్‌లోని పరిస్థితులు సైతం మరోలా ఉండేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరగబోయే యూఎస్ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇరాన్ దాడి చేసి ఉండేది కాదని ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే లిజ్ ట్రస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.