భారత్‌కు క్షమాపణలు చెప్పిన తైవాన్: కారణమేంటి?

by samatah |
భారత్‌కు క్షమాపణలు చెప్పిన తైవాన్: కారణమేంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయులకు తైవాన్ కార్మిక మంత్రి హ్సూ మింగ్ చున్ క్షమాపణలు చెప్పారు. ఫిబ్రవరి 17న కార్మిక ఒప్పందంపై తైవాన్, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అనంతరం ఓ ఇంటర్వూలో భాగంగా మింగ్ చున్ ఈ అగ్రిమెంట్‌పై మాట్లాడుతూ..తైవాన్ ఈశాన్య భారతంలోని క్రైస్తవ కార్మికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ఎందుకంటే వారి చర్మం రంగు, ఆహారపు అలవాట్లు తైవాన్ ప్రజలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి వారికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జాత్యాహంకారమని భారత్ అభివర్ణించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసింది. దీంతో తైవాన్ మంత్రి హ్సూ మింగ్ చున్ స్పందించారు. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తైవాన్ ఎవరి పట్లా వివక్ష చూపదని ఓ ప్రకటనలో వెల్లడించింది. భారతీయులందరి పట్ల సమానత్వంతో వ్యవహరిస్తామని పేర్కొంది. ‘తైవాన్ భారత సంస్కృతిని పూర్తిగా గౌరవిస్తుంది. భారతదేశ ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తాం’ అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed