ఇన్‌స్టాలో Cristiano Ronaldo రికార్డు.. ఫాలోవర్స్ ఎంత మందో తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-22 04:45:45.0  )
ఇన్‌స్టాలో Cristiano Ronaldo రికార్డు.. ఫాలోవర్స్ ఎంత మందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ పోర్చుగల్ ఆటగాడిని ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య 50 కోట్లకు చేరింది. ఈ మార్క్ అందుకున్న తొలి వ్యక్తి రోనాల్డోయే కావడం విశేషం. అర్జెంటీనా స్టార్ లియొనెల్ మెస్సీని 37.5 కోట్ల మంది ఫాలో అవుతుండగా, అమెరికా టీవీ తార కైల్ జెన్నర్ 37.2కోట్ల మంది ఫాలో అవుతున్నారు. వీరు రొనాల్డో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 22.4 కోట్ల ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ తో కోహ్లి ఈ జాబితాలో 17 వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed