ఒడిశా రైలు ప్రమాద మృతులకు పోప్ ఫ్రాన్సిస్ సంతాపం

by Javid Pasha |
ఒడిశా రైలు ప్రమాద మృతులకు పోప్ ఫ్రాన్సిస్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 2న ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోరం రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తాజాగా బాలాసోర్ రైలు ప్రమాద మృతులకు పోప్ ఫ్రాన్సిస్ సంతాపం ప్రకటించారు.

‘‘భారతదేశంలో రెండు రోజుల క్రితం (జూన్ 2) జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయినవారికి నా ప్రార్థనలు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. పరలోకపు తండ్రి మరణించిన వారి ఆత్మలను తన రాజ్యంలోకి స్వాగతించాలని కోరుకుంటున్నాను’’ అంటూ పోప్ ఫ్రాన్సిస్ తన సంతాపాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story