- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐ కృషికి ఫిజిక్స్ నోబెల్
దిశ, నేషనల్ బ్యూరో: భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రజ్ఞులకు రాయల్ స్వీడిష్ సైన్స్ అకాడమీ నోబెల్ బహుమతిని ప్రకటించింది. అమెరికా సైంటిస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్‌ఫాదర్‌గా పిలుచుకునే బ్రిటీష్-కెనడియన్ జాఫ్రీ హింటన్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ హాప్‌ఫీల్డ్‌లకు ఈ ఏడాది ఫిజిక్స్ కేటగిరీలో నోబెల్ అవార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది. మెషిన్ లర్నింగ్‌కు పునాదిగా భావించే విధానాలను వీరు ఫిజిక్స్ ఉపయోగించి అభివృద్ధి చేశారని వివరించింది. ఏఐ గురించిన ప్రమాదకర విషయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు హింటన్ గురించి ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది. ‘మనిషి కంటే తెలివిగా వ్యవహరించేవాటితో మనకు అనుభవం లేదు. వైద్యరంగంలో ఏఐ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ, దీనితో తీవ్ర పరిణామాలు కూడా ఉండొచ్చు. ఇవి మన అదుపు దాటినప్పుడు ముప్పుగా మారొచ్చు’ అని హింటన్ ఫోన్‌లో నోబెల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
‘నేటి శక్తివంతమైన మెషిన్ లర్నింగ్‌కు పునాదిగా ఉన్న మెథడ్స్‌ను వీరిద్దరూ ఫిజిక్స్ టూల్స్ ఉపయోగించి డెవలప్ చేశారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్ ఆధారిత మెషిన్ లర్నింగ్ శాస్త్రసాంకేతికతల్లో, నిత్యజీవితంలో విప్లవాన్ని తీసుకువస్తున్నది. నేడు మెషిన్లు జ్ఞాపకం ఉంచుకోవడం, నేర్చుకోవడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. వీరిద్దరు కీలకమైన ఫిజిక్స్ కాన్సెప్ట్‌లు, మెథడ్స్ ఉపయోగించి నెట్‌వర్క్స్‌లోని స్ట్రక్చర్స్‌తో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు’ అని స్వీడిష్ అకాడమి వెల్లడించింది.