- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మిరిమిట్లు గొలిపే గెలాక్సీ చిత్రాలను ఒడిసిపట్టిన నాసా

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో హబుల్ టెలిస్కోప్ స్థానాన్ని స్వీకరించనున్న నాసా కొత్త టెలిస్కోప్, పాలపుంతలో మన పొరుగున ఉన్న గెలాక్సీకి చెందిన అద్భుత చిత్రాలను ఒడిసిపట్టింది. ప్రస్తుతం పరీక్షా దశలో ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ అరుదైన చిత్రాలను ట్విట్టర్ ద్వారా నాసా షేర్ చేసింది. నాసా మునుపటి ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సేకరించిన చిత్రాలతో పోలిస్తే వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ తాజా చిత్రాలు అత్యద్భుతమైన ఫలితాలను అందించాయని నాసా తెలిపింది. పరారుణ ఆకాశాన్ని మరింత స్పష్టంగా చూడటానికి అతిపెద్ద అద్దం, మెరుగుపర్చిన డిటెక్టర్లను వెబ్ టెలిస్కోప్ కలిగివుందని పేర్కొంది.
టెలిస్కోప్ లోని మిడ్ ఇన్ఫ్రారెడ్ పరికరం ఎమ్ఐఆర్ఐ తీసిన ఈ చిత్రాలు కార్బన్, హైడ్రోజన్ పరమాణువులతో రూపొందాయని, విశ్వాంతరాళంలోని వాయువులను మరింత బాగా అర్థం చేసుకునేందుకు సైంటస్టులకు తోడ్పడతాయని నాసా తెలిపింది. 2022 జూన్ చివరినాటికి హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ని అమర్చనున్నారు. హబుల్ టెలిస్కోప్ కంటే 6 రెట్లు ఎక్కువ వ్యాసార్థం కలిగిన 25 చదరపు మీటర్ల లైట్ కలెక్టింగ్ ఏరియాను కలిగి ఉందని దీనిముందు హబుల్ టెలిస్కోప్ దిగదుడుపే అని నాసా ప్రకటించింది.