దడ పుట్టిస్తున్న మంకీ పాక్స్.. ఆఫ్రికాలో 18 వేలకు చేరిన కేసులు

by Geesa Chandu |
దడ పుట్టిస్తున్న మంకీ పాక్స్.. ఆఫ్రికాలో 18 వేలకు చేరిన కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: మంకీ పాక్స్... ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా అంత కాకపోయినా.. కరోనా తర్వాత అంతటి రేంజ్ ను, అంతటి భయానక పరిస్థితులను కలిగిస్తోంది మంకీ పాక్స్. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎంపాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఎంపాక్స్ గా పిలవబడే మంకీ పాక్స్ వైరస్, ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్18,737 కేసులు నమోదైనట్లు, మృతుల సంఖ్య 541 కు చేరినట్లు సమాచారం. మొదటగా ఆఫ్రికాలోనే పరిమితమైన ఈ వైరస్.. క్రమక్రమంగా ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోందని, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని, లేనిచో ప్రమాదం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. గతంలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూసినప్పటికీ.. ఈ సారి ఎక్కువ కేసులు నమోదు కావొచ్చని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. కాగా మొన్నటివరకు ఆఫ్రికా దేశాలలో విస్తరించిన ఎంపాక్స్, ప్రస్తుతం మన పొరుగు దేశం పాకిస్థాన్ లోనూ వ్యాపించటంతో ఇప్పుడు అందరిలో టెన్షన్ మరింత పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed