- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Gaza Strip: యెమెన్ నుండి సెంట్రల్ ఇజ్రాయెల్‌లోకి క్షిపణి ప్రయోగం
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి చర్చలు జరుగుతున్నప్పటి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా యెమెన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్‌లోకి క్షిపణి ప్రయోగం జరిగింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆదివారం ఉదయం జరిగినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ధృవీకరించింది. యెమెన్ నుండి వచ్చిన ఉపరితల క్షిపణి, తూర్పు నుండి సెంట్రల్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిందని, అయితే అది బహిరంగ ప్రదేశంలో ఎవరూ లేని చోట పడటంతో ఎలాంటి నష్టం సంభవించలేదని మిలటరీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దాడికి సంబంధించిన ఫొటోలను AFP ఫోటోగ్రాఫర్‌లు విడుదల చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నట్లు ఆ ఫొటోలో చూడొచ్చు. అయితే ఈ దాడి హుతీ తిరుగుబాటుదారులు చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. అటూ ఈ దాడి గురించి హుతీ నాయకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్ హమాస్‌పై దాడి చేయడం ప్రారంభించినప్పటి నుంచి పాలస్తీనియన్లకు సంఘీభావంగా హుతీలు, ఇజ్రాయెల్ అలాగే దానికి సంబంధించిన ఆస్తులు, షిప్‌లపై దాడులు చేస్తున్నారు.