- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan | ఇమ్రాన్ ఖాన్‌ను మహమ్మద్ ప్రవక్తతో పోల్చిన అభిమాని!.. అతడికి ఏ శిక్ష విధించారంటే..
దిశ, వెబ్ డెస్క్ : కొందరు కష్టాలు కొనితెచ్చుకుంటుంటారని వినే ఉంటాం. తాజాగా పాకిస్తాన్‌లో ఒక వ్యక్తి తన వెర్రి అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ (Pakistan)లో దైవదూషణను (Blasphemy) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. శిక్షలూ వేస్తారు. అయితే ఒక్కోసారి ప్రజలే దైవదూషణ చేసే వ్యక్తుల్ని కొట్టి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఖైబర్ పక్తుంఖ్వాలో ఓ ర్యాలీలో కొంత మంది పెద్ద ఎత్తున గుమిగూడి ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఓ వ్యక్తి దేవుడిని కించపరిచాడన్న కోపంతో అందరూ కలిసి ఆ ముస్లిం స్కాలర్‌పై దాడి చేశారు. ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ ర్యాలీలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కర్రలతో కొట్టి చంపుతున్నట్టు ఇందులో స్పష్టంగా కనిపించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిమాని అయిన ఆ వ్యక్తి ఇమ్రాన్‌ను మహమ్మద్ ప్రవక్తతో పోల్చాడు. "మహమ్మద్ ప్రవక్తను ఎంత ప్రేమిస్తానో ఇమ్రాన్ ఖాన్‌నూ అంతే ప్రేమిస్తాను" అంటూ నినదించాడు. దీంతో ఒక్కసారిగా జనాలు ఆయనపై దాడికి దిగారు. ఇమ్రాన్ ఖాన్ నిజాయితీ పరుడు అని చేసిన కామెంట్స్ కూడా అక్కడి జనాలకు ఆగ్రహం కలిగించాయి. అందుకే కర్రలతో కొట్టి హత్య చేశారు. గత అయిదేళ్లుగా ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. రచయిత హారిస్ సుల్తాన్ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. తాను ఐదేళ్లుగా పాకిస్తాన్‌లో ఉంటున్నానని, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం మృతుడి పేరు మౌలానా నిగర్ అలాం. "పాకిస్థాన్‌లో ఏదీ సింపుల్ కాదు. చిన్న చిన్న కామెంట్స్‌కి కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది" అని హారిస్ సుల్తాన్ పోస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్త పేరెత్తినా దాడులు ఎదుర్కోక తప్పదని చెప్పారు.
దైవదూషణ నేారానికి మరణ శిక్ష
దైవదూషణ చేసిన ఓ వ్యక్తికి యాంటీ టెర్రరిజం కోర్టు ఇటీవల మరణ శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూప్‌లలో దేవుడిని దూషిస్తూ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినందుకు ఈ శిక్ష విధించింది. పెషావర్‌లోని కోర్టు ఈ తీర్పునిచ్చింది. మరణశిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది. రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే..ఈ తీర్పుని రద్దు చేసేందుకు అప్పీల్ చేసుకునే అవకాశం బాధితుడికి ఉంటుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ వ్యక్తి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం వాట్సాప్ గ్రూప్‌లలో దేవుడిని దూషిస్తూ కొన్ని మెసేజ్‌లు పంపాడని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిన కోర్టు...ఆ నిందితుడిని దోషిగా తేల్చింది. 20 ఏళ్లలో పాకిస్థాన్‌లో 774 మందిపై దైవదూషణ ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని అక్కడి నేషనల్ కమిషన్ ఆఫ్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది.
Also Read: Congo Floods: కాంగోలో వరద బీభత్సం.. 203 మంది మృతి..