Israel-Hamas War : 400 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఇజ్రాయెల్

by Mahesh |   ( Updated:2023-10-08 12:19:26.0  )
Israel-Hamas War : 400 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఇజ్రాయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించిన హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ద నౌకలతో దాడులు ప్రారంభించింది. దీంతో యుద్ధం ప్రారంభమై 24 గంటలు కావస్తున్నా ఇరుపక్షాల నుంచి భీకర పోరు సాగుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఘాజీ స్ట్రిప్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయి. అదే సమయంలో, లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా స్థానాలపై ఇజ్రాయెల్ డ్రోన్ల నుండి షెల్లను ప్రయోగించింది. డ్రోన్ల ద్వారా హిజ్బుల్లా ఉగ్రవాదుల స్థానాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంతకు ముందు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఘాజీ స్ట్రిప్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయి.

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసిన వీడియో బయటపడింది. ఇందులో వాహనం నుండి పారిపోతున్న ఉగ్రవాదులపై యుద్ధ విమానాల నుంచి క్షిపణులు పడటం కనిపించింది.. 232 మందికి పైగా ప్రతీకార దాడుల్లో గాజాలో మరణించారు. కాగా ఈ యుద్ధంలో మొత్తం 400 మంది ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. అలాగే వందల సంఖ్యలో తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story