IRAN: ఇజ్రాయెల్‌పై దాడికి ఇంత ఖర్చా?

by HARISH SP |
IRAN: ఇజ్రాయెల్‌పై దాడికి ఇంత ఖర్చా?
X

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. దీనిని నిజం చేస్తూ డబ్బు కూడా మానవ సంబంధాలను ఏనాడో మాయం చేసింది. ఇప్పుడు ఏ పని చేసినా ఎంత డబ్బు ఖర్చయ్యిందని ప్రతి ఒక్కరు లెక్కలు వేసుకుంటారు. మనుషులదే కాదు.. దేశాల మధ్య సంబంధాలకు యుద్ధాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇదంతా ఎందుకు అంటే.. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏకబిగిన 180 బాలిస్టిక్, హైపర్ సోనిక్ మిసైళ్లతో దాడి చేయడంతో ప్రపంచమే నివ్వెరపోయింది. ఒకప్పుడు ఇరాక్ స్కడ్ బాంబులతో దాడి చేయడం అప్పట్లోనే చాలా ఖరీదైన వ్యవహారంగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పుడు జరిగిన దాడికి కూడా ఇరాన్ డబ్బును నీళ్లలాగే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇరాన్ వేసిన 181 బాంబులకు అయిన ఖర్చు చూస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. యుద్ధం ఇంత ఖరీదైనదా? అని ఆశ్చర్యపోవాల్సిందే. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన 181 బాలిస్టిక్ మిసైళ్లలో ఫతాహ్, ఖైబర్ షేకన్ మిసైళ్లు ఉన్నాయి. ఈ మిసైళ్ల ధర ఒక్కోటి దాదాపుగా 3.5 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ. 29కోట్లు. అంటే 181 మిసైళ్లకు దాదాపుగా రూ.5300కోట్లు ఖర్చు అయ్యింది. ఇరాన్ చరిత్రలోనే ఈ గంటపాటు సాగిన యుద్ధం అత్యంత ఖరీదైనదిగా నిలిచిపోవచ్చు.

Next Story

Most Viewed