Iran : ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి : అమెరికా

by Hajipasha |   ( Updated:2024-08-07 19:12:37.0  )
Iran : ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి : అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లాలు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. దీనిపై జీ7 దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇరాన్ దాడికి పాల్పడకముందే.. ఇజ్రాయెల్ స్వయంగా ఇరాన్‌పై దాడికి దిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇజ్రాయెల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దాడి చేయకుండా ఇరాన్‌ను నిరోధించేందుకు ఇజ్రాయెల్ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఇరాన్ దాడి భయం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎటువంటి వైఖరిని తీసుకోవాలనే దానిపై చర్చించేందుకు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తాజాగా కీలక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో మోసాద్, షిన్ బెట్ విభాగాల అధిపతులు డేవిడ్ బర్నియా, రోనెన్ బార్, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, IDF చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి పాల్గొన్నారు.

Advertisement

Next Story