ఉద్యోగులకు షాకివ్వబోతున్నఫేస్ బుక్ మాతృ సంస్థ?

by Javid Pasha |   ( Updated:2023-04-19 13:33:49.0  )
ఉద్యోగులకు షాకివ్వబోతున్నఫేస్ బుక్ మాతృ సంస్థ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల మెడపై కత్తులు వెలాడుతున్నాయి. లే ఆఫ్ లపై ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనంటూ ఎంప్లాయిస్ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి షాకింగ్ డిసిషన్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది నవంబర్ లో 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన మెటా.. తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఖర్చుల భారం తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు మరో పది వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాలనే నిర్ణయంతో మెటా ఉన్నట్లు సమాచారం. మెటా పరిధిలో ఉన్న ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీలో పని చేస్తున్న రియాలిటీ ల్యాబ్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్న సంస్థ ఇందులో భాగంగా లే ఆఫ్ లను ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ విషయాన్ని మేనేజర్లకు అంతర్గతంగా సందేశం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read..

ఫ్రెషర్లకు మరో పరీక్ష పెట్టనున్న విప్రో!

Advertisement

Next Story

Most Viewed