- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అధ్యక్షుడిగా ఆయనే బెటర్: పుతిన్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ కంటే బైడెన్ ఉత్తమమని భావిస్తున్నట్టు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పుతిన్ మాట్లాడారు. ‘బైడెన్ అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన గురించి ఊహించడం చాలా సులభం’ అని చెప్పారు. అయితే అమెరికన్ ప్రజలు ఎన్నుకునే ఏ నాయకుడితోనైనా కలిసి పని చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. అమెరికా ఎన్నికలకు సంబంధించి పుతిన్ ప్రకటన చేయడం ఇదే మొదటి సారి. బైడెన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలపై స్పందించిన పుతిన్..2021 స్విట్జర్‌ల్యాండ్‌లో ఆయనను కలిశానని గుర్తు చేశారు. ఆ టైంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా-యూఎస్ సంబంధాలు క్షీణించాయి. రష్యా చేస్తున్న దాడులపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అది సరైన పద్దతి కాదని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా కంటే ముందే రష్యాలోనూ ఈ ఏడాది మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 1999 నుంచి పుతినే అధికారంలో ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే అధ్యక్షుడు కానున్నట్టు తెలుస్తోంది.