Google | గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకిన యువ ఇంజనీర్.. ఏం జరిగిందంటే?

by S Gopi |   ( Updated:2023-05-07 02:32:13.0  )
Google | గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకిన యువ ఇంజనీర్.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో గూగుల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి సంస్థ ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్సియాలోని ఒక భవనంలో గూగుల్ కార్యాలయం 14వ అంతస్తులో ఉంది. 31 ఏళ్ల ఆ సాఫ్టవేర్ ఇంజనీర్ గురువారం ఆ అంతస్తు నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఫిబ్రవరి 2023 నెలలో కూడా ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

పోలీసుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో గూగుల్ కార్యాలయం వద్ద పడి ఉన్నాడని సమచారం పోలీసులకు వచ్చింది. ఆ తరువాత పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ల చూడగా.. నేలపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. పోలీసులకు గూగుల్ కార్యాలయం 14వ అంతస్తుపై మృతుడి వేలి ముద్రలు లభించాయి. దీంతో పోలీసులు ఆ యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గూగుల్ సంస్థ ఇంతవరకు స్పందించలేదు.

ఇదే కార్యాలయానికి చెందిన మరో ఉద్యోగి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాట్(33) ఫిబ్రవరి నెలలో తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ వరుస ఘటనలతో గూగుల్ ఉ్యదోగులపై మానసిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి:

Pakistan | భారత్‌తో దోస్తీ కోసం పాకిస్తాన్ అడుగులు.. 600 మంది భారత జాలర్ల విడుదలకు నిర్ణ‌యం


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed