గుండెపోటుతో మాజీ ప్రధాని కన్నుమూత

by GSrikanth |
గుండెపోటుతో మాజీ ప్రధాని కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ప్రధాని లీ కెకియాంగ్(68) కన్నుమూశారు. గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కెకియాంగ్ అకాల మరణం చెందారు. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా కొనసాగారు. సంస్కరణల ఆలోచలు ఉన్న బ్యూరోక్రాట్‌గా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న లీ కెకియాంగ్ చైనా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యమున్న ఆయన చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. యువతను ఉదారవాద భావనలవైపు ప్రోత్సాహించేవారని సమాచారం. ఆయన పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆయనకు పెద్ద కళంకంగా మిగిలిపోయింది. ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.

Advertisement

Next Story

Most Viewed