- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలన్ మస్క్ సంచలన ప్రకటన.. ట్విట్టర్ నూతన సీఈఓగా మహిళ!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు వారాల్లో ఓ మహిళ ట్విట్టర్‌కు నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని స్వయంగా ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నూతన సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోబోతోందనే ప్రకటన తప్ప మరే ఇతర విషయాలను ఆయన స్పష్టం చేయలేదు.
అయితే ప్రస్తుతం తాను ట్విట్టర్ కు సీఈఓగా వ్యవహరిస్తున్నందునా ఆ బాధ్యతలను ఓ మహిళకు అప్పగించిన అనంతరం తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్ట్, సాఫ్ట్ వేర్ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ప్రకటనపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ కుర్చిలో కూర్చోబెట్టి ఎలన్ మస్క్ అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కొత్త సీఈఓ రాబోతున్నారని ఆయన చేసిన ప్రకటనపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
Also Read.
ఆరేళ్ల చిన్నారిని రేపిస్ట్ నుండి కాపాడిన ర్యాపిడో డ్రైవర్ ఫస్ట్ రియాక్షన్ (వీడియో)