రూ. 2 వేల కోట్ల ఆస్తి వద్దనుకుని ప్రేమికుడిని పెళ్లాడిన.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-08-16 14:54:07.0  )
రూ. 2 వేల కోట్ల ఆస్తి వద్దనుకుని  ప్రేమికుడిని పెళ్లాడిన.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ కోసం కొందరు ఎంతకైన తెగిస్తారు. ప్రేమించినవారి కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసేందుకు ఇష్టపడతారు. అయితే ఓ ప్రియురాలు మాత్రం తాను ప్రేమించినవాడిని పెళ్లాడేందుకు ఏకంగా రూ. 2 వేల కోట్లను వదిలేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఏంజెలిన్ ఫ్రాన్సిస్ అనే అమ్మాయి..మలేషియాలో బిజినెస్ మాగ్నెట్ ఖూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ చాయ్ కూతురు. ఏంజెలిన్ , జెడిడియా అనే అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె పేరెంట్స్ కు చెప్పింది. దానికి ఆమె తల్లిండ్రులు ఒప్పుకోలేదు. నువ్వు జెడిడియాను పెళ్లి చేసుకుంటే తమ రూ. 2,484 కోట్ల ఆస్తిపై ఆశలు వదులుకోవాలని ఏంజెలిన్ ను హెచ్చరించారు. అయినా వినని ఆ అమ్మాయి.. ప్రియుడిని పెళ్లి చేసుకుందట. అయితే ఈ వార్త తెలిసిన నెటిజెన్స్ మీ లాంటి వాళ్లు భూమి మీద ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.. మా చెల్లిని మంచిగా చూసుకో అంటూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story