- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google GPS : గూగుల్ మ్యాప్‌లో వచ్చే లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు దారి తెలియటానికి గూగుల్ మ్యాప్స్‌లో లోకేషన్ అన్ చేసుకుని వెళ్తాం. డైరెక్షన్ పెట్టుకుని వెళుతున్నప్పుడు '10 మీటర్స్... టేక్ లెఫ్ట్', 'రీచ్డ్ యువర్ డెస్టినేషన్' అంటూ దారి విషయాలు చెప్పే తియ్యని గొంతు ఎవరిదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఏ స్మార్ట్ ఫోన్ లోనైనా వినిపించే ఆ గొంతు ఆస్ట్రేలియాకు చెందిన కారెన్ జాకబ్సన్ ది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా రైటర్, సింగర్‌గా గుర్తింపు పొందిన కారెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల జీపీఎస్ యూనిట్లు, 30 కోట్ల స్మార్ట్ ఫోన్ డివైజ్లలో కారెన్ గొంతు వినిపిస్తుంది. అందుకే ఆమె 'జీపీఎస్ గర్ల్' బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని 'మాకే' నగరంలో జన్మించిన కారెన్ ఏడేళ్ల వయసులోనే పాటలు రాసేది. ప్రముఖ గాయని ఓవియా న్యూటన్ నేను స్ఫూర్తిగా తీసుకుంది. సంగీతంలో పట్టా పుచ్చుకుంది. 2002లో కారెన్‌కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది.
అమెరికాలోని ఒక సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గొంతు కావాలని వెతుకుతోంది. కారెన్ గురించి తెలిసి ఆ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఫోన్ చేశారు. కారెన్ ఆ ఉద్యోగంలో చేరాక 50 గంటలు పాటు తన మాటలు రికార్డు చేసి జీపీఎస్ కోసం వాయిస్ సిస్టమ్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఏ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినా వినిపించేది తన గొంతే. కారెన్ గొంతు జీపీఎస్‌లో కాకుండా ఇంకా అనేక చోట్ల వినిపిస్తుంది. ఎలివేటర్స్, క్రూయిజ్ షిప్‌లు, సినిమా థియేటర్స్, హోటల్స్, ఆడియో బుక్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలోనూ ఆమె గొంతు వినిపిస్తుంది. జీపీఎస్ అవకాశం రాక ముందు టెలివిజన్ రేడియో కార్యక్రమాల కోసం కారెన్ తన గొంతును అందించింది.
- Tags
- google map