- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్డును ఎలా ఉడికించాలో తెలుసా? అమెరికా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?

దిశ, వెబ్ డెస్క్: గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, సెలెనియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. ప్రతి రోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. పైగా చికెన్, మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్‌లో దొరుకుతుంది కాబట్టి గుడ్డును ఎక్కువ మంది ఇష్టంగా తింటుంటారు. ఇక ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. ఇందులో కేలరీలు అనారోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. చిన్నప్పటి నుంచి గుడ్లను తినడం వల్ల వయసు పెరిగిన తర్వాత కంటి చూపు క్షీణించకుండా కాపాడుతుంది. అయితే గుడ్డులో ఉండే పోషకాలు మనకు పూర్తిస్థాయిలో అందాలంటే.. గుడ్డును ఎంతసేపు ఉడికించాలనేది చాలా మందికి కచ్చితంగా తెలియదు. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు గుడ్డును ఎంత సేపు, ఏ పద్ధతిలో ఉడికించాలనేది వెల్లడించారు.
సాధారణంగా గుడ్డులో తెల్లసొన, పచ్చసొన రెండు ఉంటాయని అందరికి తెలుసు. ఇవి ఉడికించిన తర్వాత పచ్చ సొన మృదువుగా, తెల్ల సొన మెత్తగా దట్టమైన తెలుపు రంగు కలిగి ఉంటాయి. ఇక రెండింటిల్లోనూ సమతుల్యంగా పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆ షోషకాలన్నీ మనకు సరిగ్గా అందాలంటే గుడ్డును ఎంతసేపు, ఏ విధంగా ఉండికించాలనే దానిపై అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే దాన్ని.. ముందుగా మరుగుతున్న నీరున్న పాత్రలోంచి గోరువెచ్చని నీరులోకి, గోరువెచ్చని నీటిలోంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా మొత్తం 32 నిమిషాలు చేసి.. చివరగా చల్లటి నీటిలో ఉంచాలి. ఆపై పెంకు తీసి తినాలని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక గుడ్డును ఉడికించిన తర్వాత ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. ఒక వేళ ఫ్రిజ్ నిల్వ ఉంచాలనుకుంటే పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. పొట్టు తీసి గుడ్లు పెట్టినట్లయితే 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను గాలి దూరని ప్రదేశంలో ఉంచాలి.