Bangladesh: ఓపిక పట్టండి.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి: యూనస్

by Harish |
Bangladesh: ఓపిక పట్టండి.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి: యూనస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికైన మహమ్మద్ యూనస్ మంగళవారం ఢాకాలోని చారిత్రాత్మక ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్, మహానగర్ సర్బజనిన్ పూజ కమిటీ ప్రతినిధులతో పాటు ఆలయ నిర్వహణ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, హక్కులు అందరికీ సమానం. మనమందరం ఒకే హక్కు కలిగిన వ్యక్తులం. ప్రజల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కల్పించవద్దని కోరారు. దయచేసి ఓపిక పట్టండి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ పరిష్కరించడంలో విఫలం అయితే అప్పుడు మమ్మల్ని విమర్శించండి అని అన్నారు.

బంగ్లాదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు భద్రత ఉంది. ప్రజాస్వామ్య ఆకాంక్షలలో ముస్లింలు, హిందువులు, బౌద్ధులు మొదలగు వారిని వేరుగా చూడకూడదు, మనమందరం మనుషులం అని పేర్కొన్నారు. హిందువులపై దాడులు చేయడాన్ని హేయమైన చర్యగా ఆయన వర్ణించారు. మరోవైపు యూనస్ పర్యటన తర్వాత, ఆలయంలో ముస్లిం, హిందూ మైనారిటీ ప్రతినిధుల మధ్య ఒక సమావేశం జరిగింది. దీనిలో రెండు సంఘాలు వివిధ అంశాలపై చర్చించారు. శాంతియుత సమాజాన్ని పెంపొందించడంలో ఐక్యతగా ఉండాలని, మైనారిటీ హిందూ సమాజానికి ఎటువంటి ప్రమాదం లేదని వారిని వేధించే లేదా దాడి చేయడానికి ప్రయత్నించే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటామని ఇరువర్గాలు నిర్ణయించాయి.

Advertisement

Next Story

Most Viewed