Bangladesh: బంగ్లాదేశ్‌లో విద్యా సంస్థల ఓపెన్.. నెల రోజుల తర్వాత పున:ప్రారంభం

by vinod kumar |
Bangladesh: బంగ్లాదేశ్‌లో విద్యా సంస్థల ఓపెన్.. నెల రోజుల తర్వాత పున:ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: హింసాత్మక పరిస్థితుల తర్వాత బంగ్లాదేశ్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్లర్ల నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు ఆదివారం పున:ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలతో సహా అన్ని విద్యా సంస్థలను తిరిగి తెరిచారు. విద్యా మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సంస్థలను తెరవాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆగస్టు 18 నుంచి అన్ని విద్యా సంస్థల్లో అకడమిక్ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముహమ్మద్ యూనస్ సూచనల మేరకు విద్యా సంస్థలను తిరిగి అధికారులు ప్రారంభించారు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ఢాకా నగరంలో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో జాబ్ కోటా వ్యవస్థను సంస్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం జూలై 17న దశంలోని అన్ని విద్యా సంస్థలను నిరవధికంగా మూసి వేశారు.

Advertisement

Next Story

Most Viewed