- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యద్భుత కట్టడాలతో అత్యున్నత ప్రైజ్ గెలుచుకున్న మొదటి బ్లాక్ మ్యాన్!
దిశ, వెబ్‌డెస్క్ః టాలెంట్ అనేది ఏ ఒక్కరికీ చెందినది కాదు. అది సర్వజనీనం. అందులోనూ మట్టిలో మాణిక్యాల్లా కొందరుంటారు. జీవితాన్నే పాఠాలుగా నేర్చుకొని, ఏ రంగంలో ఉన్నా సామాన్యుల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తుంటారు. ఇక, మనం చెప్పుకోబోయే ఈ వ్యక్తి మరింత ప్రత్యేకం. అందుబాటులో ఉన్న సాధారణ వస్తువుల్నే అద్భుతమైన కట్టడాలుగా మార్చి అబ్బురపరిచే ఆర్కిటెక్చర్. అంతేనా, అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త.. ఫ్రాన్సిస్ కెరే. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో అనే దేశంలో అత్యంత మారుమూల గ్రామమైన గాండోలో జన్మించి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆర్కిటెక్చర్ రంగంలో 'నోబుల్ బహుమతి'గా పేరొందిన ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్-2022ను సాధించారు. అత్యంత గౌరవమైన ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి నల్లజాతీయునిగా చరిత్రలో నిలిచారు.
ఈయన బిలియనీర్ల బిల్డింగుల కోసం కాదు, బక్కచిక్కిన బడుగు జీవుల కోసం పనిచేస్తారు. అందుకే, ఫ్రాన్సిస్ కెరేకు ఈ అవార్డు ఇచ్చిన ప్రిట్జ్‌కెర్ ప్రైజ్ ప్యానెల్ ఎంతో వినయంతో ఆయన ప్రతిభను వివరించింది. స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలను, వస్తువుల్ని తెలివిగా ఉపయోగించడం, సైట్-నిర్దిష్ట విధానం, ప్రకృతితో అనుసంధానం చేస్తూ నిర్మించే ఆయన దృష్టి కౌశల్యం, అంతకుమించి, అట్టడుగు వర్గాలకు సౌకర్యాన్నికలిగించడానికే ప్రాధాన్యత ఇచ్చే ఆయన నిబద్ధతను ప్యానల్ ఎంతో ప్రశంసించింది. 'ఫ్రాన్సిస్ కెరే సరైన సదుపాయాలు లేని దేశాల్లో - భూమికి, అక్కడి నివాసులకు నిలకడగా ఉండే ఆర్కిటెక్చర్ కల్పించడంలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అసమానమైన గొప్ప వాస్తుశిల్పి, సేవకుడు, ఒక ప్రాంతంలోని అసంఖ్యాక పౌరుల జీవితాలను, అనుభవాలను మరచిపోయేలా మెరుగుపరచగల సృష్టికర్త' అని అవార్డును సమర్థించిన ది హయత్ ఫౌండేషన్ ఛైర్మన్ థామస్ ప్రిట్జ్‌కర్ అంటారు.
ఫ్రాన్సిస్ కెరే నిర్మాణాలు 'కట్టడాలు కూడా మాట్లాడతాయా' అన్నట్లు అందం, వినయం, ధైర్యం ఆయన ఆవిష్కరణల్లో కనిపిస్తుందని అంటారు విమర్శకులు. ఈ సందర్భంగా కెరే మాట్లాడుతూ.. 'అత్యున్నత పురస్కారం తీసుకోండం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం కాదు. నేను నమూనాను మార్చాలనుకుంటున్నాను. ప్రజలను కలలు కనేలా, మరింత రిస్క్ తీసుకునే విధంగా ప్రభావితం చేయాలనుకుంటున్నాను. ధనవంతులు కాబట్టి మెటీరీయల్‌ని వృధా చేయొచ్చని, పేదవాళ్లు కాబట్టి వారికి నాణ్యత, సౌకర్యం అవసరం లేదని అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ నాణ్యతకు అర్హులే, ప్రతి ఒక్కరూ విలాసానికి అర్హులే, ప్రతి ఒక్కరూ సౌకర్యానికీ అర్హులే.. పర్యావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కొరతను.. అన్నింటినీ ఇంటర్‌లింక్ చేసుకుంటూ పనిచేయడమే మా లక్ష్యం' అంటారు.