- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారతీయ విద్యార్థి సత్యసాయి దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధాకరమని పేర్కొంది. విద్యార్థి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ముమ్మర దరఖాస్తు జరుగుతోందని, ఉమా గద్దె మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. విద్యార్థి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్టు పేర్కొంది. అయితే మరణానికి గల కారణాలను వెల్లడించలేదు. అంతేగాక సత్యసాయి భారత్‌లోని ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనే విషయాలు కూడా స్పష్టం చేయలేదు. దీంతో ఈ ఏడాది అమెరికాలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.
గత నెలలో కోల్‌కతాకు చెందిన శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపబడ్డాడు. అదే నెలలో బోస్టన్ యూనివర్శిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి సైతం హత్యకు గురయ్యాడు. తాజా ఘటనతో భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, వివిధ ప్రాంతాల్లోని కాన్సులేట్ల అధికారులు, భారతీయ విద్యార్థులతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించింది. విద్యార్థుల రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.