- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాళ్లతో కారు డ్రైవింగ్.. అంతేనా, సిగరేట్ తాగుతూ, కాళ్లు బయటపెట్టి.. వామ్మో!! (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ః 'డోంట్ ట్రై ఇట్', ఎందుకంటే అన్ని సందర్భాలూ, సౌకర్యాలూ ఒకేలా ఉండకపోవచ్చు. అలాగే, ప్రమాదకర స్టంట్‌లు అందరూ చేయలేరని ప్రత్యేకంగా చెప్పనవసరమూ లేదు. భూమిపైన కాలుష్యంగా మారుతున్న వాహనాలతో పాటు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికమవుతున్నాయని తెలిసినా ఇలాంటి వారికి 'ఇవరం' తెలిసిరావట్లేదు! నెట్టింట్లో మరో నిర్లక్ష్యపు డ్రైవర్ ఇప్పుడు వైరల్ అయ్యాడు. దక్షిణాఫ్రికాలో చిత్రీకరించిన ఈ వీడియోలో ఓ యువకుడు డ్రైవర్ సీటులో జారబడి కూర్చోని, చేతిలో తాగుతున్న సిగరేట్‌తో, కాళ్లతో స్టీరింగ్ తిప్పుతూ కారు నడుపుతుంటాడు. ఒకానొక సమయంలో ఎవరికో హాయ్ చేప్పడానికి కూడా కారు కిటికీలోంచి కాలునే ఊపడం మరో విశేషం.
ఈ వీడియోకు స్థానికంగా అనేక కామెంట్‌లు వస్తున్నాయి. ఇందులో చాలా మంది ఇంతకీ ఆ కారు నడుపుతున్న ప్రాంతమేదో కనుక్కోడానికే ఎక్కు వ ప్రయత్నించారు. అతణ్ణి గుర్తించి శిక్షించాలని డిమాండ్‌లు కూడా చేశారు.
Taxi Drivers 🤣🤣🤣🤣👐
— Ma Shu Du (@_Mashudu_M) March 14, 2022
⚠️Guess the Province pic.twitter.com/NP5q7DLHDt