- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భారీ షాక్..కారణమిదే?
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌లో అక్కడి పౌరులు నెతన్యాహుకు వ్యతిరేకంగా భారీగా నిరసనలు తెలిపారు. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది టెల్ అవీవ్‌లో ర్యాలీ నిర్వహించారు. బంధీల విడుదలపై దృష్టి సారించకుండా నెతన్యాహు రాజకీయ ప్రయోజనాల కోసమే పాటు పడుతున్నారని ఆరోపించారు. వెంటనే హమాస్ చేతిలో ఉన్న బంధీల విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేగాక ఇజ్రాయెల్‌లో ఎన్నికలు సైతం జరిపించాలని కోరారు.
మంత్రి వర్గం నుంచి తప్పుకుంటా: బెన్నీ గాంట్జ్ వార్నింగ్
యుద్ధం తర్వాత గాజా కోసం కొత్త ప్రణాళికను రూపొందించకుంటే తాను మంత్రివర్గానికి రాజీనామా చేస్తానని ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే దేశాన్ని విధ్వంసం వైపు నడిపిస్తే.. కేబినెట్‌ను విడిచిపెడతామని తెలిపారు. దీనికి గాను జూన్ 8 వరకు గడువు విధించారు. యుద్ధానికి సంబంధించి 6 పాయింట్ల ప్రణాళికను కూడా రూపొందించారు. ఇందులో బందీలను స్వదేశానికి తీసుకురావడం, హమాస్ అధికారాన్ని అంతం చేయడం, గాజా నుంచి దళాలను వెనక్కి రప్పించడం వంటివి ఉన్నాయి.
కేబినెట్ మంత్రి అల్టిమేటం జారీ చేయడం, భారీగా పౌరులు నిరసనలు తెలుపుతుండటంతో నెతన్యాహుకు భారీ షాక్ తగిలినట్టు అయింది. అంతకుముందు అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించినప్పటికీ కాల్పుల విరమణపై నెతన్యాహు విముఖత వ్యక్తం చేయడంతో బంధీల కుటుంబాలు, వారి మద్దతు దారులు నెతన్యాహుపై విరుచుకుపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి 8లక్షల మంది ప్రజలు స్థానభ్రంశం చెందినట్టు పలు కథనాలు వెల్లడించాయి. రఫాను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్టు తెలిపాయి.