9 ఏళ్ల వ‌య‌సులో, ఒంట‌రిగా 3,000 కి.మీ. ఫ్లైట్‌లో తిర‌గాడు! పోలీసులే షాక్‌!!

by Sumithra |   ( Updated:2022-03-05 14:18:56.0  )
9 ఏళ్ల వ‌య‌సులో, ఒంట‌రిగా 3,000 కి.మీ. ఫ్లైట్‌లో తిర‌గాడు! పోలీసులే షాక్‌!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఒంట‌రిగా దూర ప్ర‌యాణ చేయ‌డ‌మంటే పెద్దొళ్ల‌కే కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అలాంటిది 3 వేల‌ కిలో మీట‌ర్లు ఒంట‌రిగా, అందులోనూ ఫ్లైట్‌లో ప్ర‌యాణం చేయ‌డమంటే ఆశ్చ‌ర్య‌మేయ‌క మాన‌దు. అందుకే, పిల్ల‌లు పిడుగులన్న మాట‌కు అచ్చ‌మైన మ‌చ్చుతున‌క ఈ బుడ్డొడు. పేరు, ఇమాన్యుయేల్ మార్క‌స్ ఓలీవిరా, వ‌య‌సు తొమ్మిదేళ్లే... అయితే మాత్రం, భ‌య‌మ‌నేదే లేకుండా పెద్ద సాహ‌సానికే ఒడిగ‌ట్టాడు. విమానంలో టికెట్ లేకుండా ఫ్రీగా ప్ర‌యాణం చేయ‌డం ఎలా? అని గూగుల్‌లో వెతికి.., మ‌రి ఎలాంటి ఐడియా దొరికిందో కానీ ఇంట్లో చెప్ప‌కుండా వెళ్లిపోయాడు. నార్త్‌వెస్ట్ర‌న్‌ బ్రెజిల్‌లోని మానౌస్ ప్రాంతంలో ఉండే మార్క‌స్ మార్చి 5న‌ ఉద‌యాన్నే ఇలాంటి పిడుగులాంటి ప‌నిచేశాడు.

మార్క‌స్ త‌ల్లి డానియేల్ మార్క‌స్ ఈరోజు తెల్ల‌వారుజామున లేచిన‌ప్పుడు మార్క‌స్ మంచంపైన నిద్ర‌పోతూనే ఉన్నాడు. కాసేపు, ఆమె త‌న ఫోన్‌లో అవీ ఇవీ చూసుకుంటూ, ఉద‌యం 7.30 గం. మ‌ళ్లీ గ‌దిలోకెళ్లి చూసిన‌ప్పుడు మార్క‌స్ క‌నిపించ‌లేదు. కంగారుప‌డుతూ వెతుకులాట ప్రారంభించారు. ఇంకోవైపు, బ్రెజిల్‌ ఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్‌హోస్ అనే ప్రాంతానికి లాటమ్ విమానంలో ప్ర‌యాణం చేస్తూ ఉన్నాడు మార్క‌స్‌. ఇంటి నుంచి వ‌చ్చేసి, ఫ్లైట్ టికెట్ కూడా కొన‌కుండా ఏకంగా 2,700 కి.మీ. ప్ర‌యాణం చేశాడు. ప్ర‌యాణానికి ముందు విమానంలో టికెట్టు కొన‌కుండా, దాక్కొని, దొంగ‌త‌నంగా ప్ర‌యాణం చేయ‌డం ఎలా అని గూగుల్‌లో వెతికి, ఈ ప‌నికి పూనుకున్నాడు.

మొత్తానికి మార్క‌స్ ఎక్క‌డున్నాడో తెలుసుకున్న త‌న త‌ల్లి ఊపిరి పీల్చుకుంది. మ‌రోవైపు, మానౌస్ ఎయిర్‌పోర్టు అధికారులు మాత్రం దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఒక పిల్లాడు ఎలాంటి గుర్తింపు డ్యాక్యుమెంట్లూ, టికెట్‌, ల‌గేజీ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాడో తెలుసుకోడానికి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. స్థానికి పోలీసు శాఖ కూడా అత‌ను ఎలా వ‌చ్చి, ఎలా విమానంలోకి ఎక్కాడో తెలుసుకోడానికి సీసీ కెమెరాలను ప‌రిశీలిస్తున్నారు. అయితే, మార్క‌స్ ఫ్యామిలీకి ఎలాంటి నేర చ‌రిత్ర లేదు. మార్క‌స్ వాళ్ల బంధువుల‌ను క‌ల‌వ‌డానికి మాత్ర‌మే ఈ సాహ‌సానికి పూనుకున్నాడ‌ని ద‌ర్యాప్తులో తేలింది.

Advertisement

Next Story

Most Viewed