Sudan: సుడాన్‌లో పారామిలిటరీ దాడిలో 80 మంది మృతి

by Harish |
Sudan: సుడాన్‌లో పారామిలిటరీ దాడిలో 80 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ సూడాన్‌లోని ఒక గ్రామంలో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) జరిపిన దాడిలో 80 మంది మరణించారు. సిన్నార్ రాష్ట్రంలోని జల్కిని గ్రామంపై ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు దాడి చేసి బాలికలను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాయి. స్థానికులు దీనిని అడ్డుకోడానికి యత్నించగా వారు కాల్పులు జరపడంతో ఈ మరణాలు సంభవించాయి. అయితే ఈ రక్తపాతానికి సంబంధించి సుడాన్ పారామిలిటరీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే సిన్నార్ యువత మాత్రం మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎఫ్ ఇటీవల కాలంలో గ్రామాలపై దాడి చేస్తుంది. వారి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. ఐదు రోజుల క్రితం కూడా ఆర్‌ఎస్‌ఎఫ్ గ్రామంపై దాడి చేసింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ, ఇళ్లపై దాడి చేస్తున్నారని వారు చెబుతున్నారు.

జూన్ నుండి రాష్ట్ర రాజధాని నగరం సింగాతో సహా సిన్నార్ రాష్ట్రంలోని పెద్ద భూభాగాలను ఆర్‌ఎస్‌ఎఫ్ నియంత్రిస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం, సిన్నార్ రాష్ట్రంలో జరిగిన దాడుల్లో 7,25,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇటీవలి UN డేటా ప్రకారం, దాదాపు 2.2 కోట్ల మంది ప్రజలు పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతుండగా, దాదాపు 10.7 మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు సుడాన్‌లో అంతర్గతంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story