రెండు చేతులతో నిమిషంలో 45 పదాల రికార్డు

దిశ, వెబ్ డెస్క్: రెండు చేతులతో రాయగల ఘనులను ‘సవ్యసాచి’ అంటారని తెలుసు కదా. మంగళూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక ‘ఆది స్వరూప’.. అలా రెండు చేతులతో ఒక్క నిమిషంలోనే 45 పదాలు రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు‌లో చోటు సంపాదించేందుకు ప్రయత్నించింది. అలా సెప్టెంబర్ 15న ఈ ఫీట్ సాధించింది. లక్కీగా స్వరూప బర్త్ డే కూడా అదే రోజు కావడం విశేషం. ఈ మేరకు గిన్నిస్ ప్రతినిధులకు.. స్వరూప రికార్డును పంపించారు.

కుడి చేతితో రాస్తూనే.. ఎడమచేతితో మిర్రర్ రైటింగ్ రాయడం స్వరూపకు చేతులతో పెట్టిన విద్య. స్వరూపకు వాళ్ల నాన్నే ఇందులో శిక్షణ ఇచ్చాడు. రెండు సంవత్సరాల నుంచి చాలా ఇష్టంతో కష్టపడి ఈ విద్యను నేర్చుకుంది స్వరూప. అంతేకాదు లాక్‌డౌన్‌తో కలిసి వచ్చిన టైమ్‌ను రెండు చేతులతో.. యుని డైరెక్షన్, లైఫ్ట్ హ్యాండ్ స్పీడ్, రైట్ హ్యాండ్ స్పీడ్, రివర్స్ రన్నింగ్, మిర్రర్ ఇమేజ్, హెటిరో టాపిక్, హెటిరో లింగ్విస్టిక్, ఎక్సేంజ్, డ్యాన్సింగ్, బ్లైండ్ ఫోల్డింగ్ వంటి పది రకాల భిన్నమైన రైటింగ్స్ రాయడానికి కేటాయించింది. ఈ క్రమంలోనే తాజాగా తన రెండు చేతులతో నిమిషంలోనే 45 పదాలు రాసి గిన్నిస్ రికార్డు‌కు ప్రయత్నించింది. కాగా, గత రికార్డు నిమిషంలో.. 25 పదాలుగా ఉంది.

స్వరూప సవ్యసాచి మాత్రమే కాదు.. లిటరేచర్, మ్యూజిక్, యక్షగాన, పెయింటింగ్, మిమిక్రీ, బీట్ బాక్స్, మెమొరీ పవర్, రూబిక్స్ క్యూబ్ తదితర వాటిల్లోనూ సత్తా చాటింది. గిటార్ కూడా నేర్చుకుంటోంది. కన్నడ, ఇంగ్లీష్ లాంగ్వేజేస్‌లోనూ ఆమెకు పట్టుంది. అంతేకాదు.. పద్యాలు, నవలలు, స్టోరీలు కూడా రాస్తుంది. ఆమె పదో బర్త్ డే సందర్భంగా.. స్వరూప రాసిన 40 కథలతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోనూ తను ప్రదర్శనలు ఇచ్చింది. ఒకటిన్నర వయసులోనే అక్షరాలను నేర్చుకున్న స్వరూప.. రెండున్నరేళ్ల వయసొచ్చేసరికి రోజుకు 30 పేజీలు రాసేదని స్వరూప తల్లి సుమద్కర్ చెబుతోంది. స్వరూప రెగ్యులర్ స్కూలింగ్‌కు వెళ్లలేదు. అందుకే వచ్చే మార్చిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాయబోతుంది. ఆమె రూబిక్ క్యూబ్‌తోనూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.

Read Also..

తలుపుల సంతానం

Advertisement