సిద్ధిపేటలో వరల్డ్ పెయింటింగ్ డే

by  |
సిద్ధిపేటలో వరల్డ్ పెయింటింగ్ డే
X

దిశ, సిద్ధిపేట: ‘వరల్డ్ పెయింటింగ్ డే’ ను పురస్కరించుకొని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ‘తెలంగాణ బతుకు చిత్రాల ప్రదర్శన’ను అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చిత్రకళ ప్రాముఖ్యత.. ఆవశ్యకత గురించి వివరిస్తూ చిత్రాన్ని చిత్తరువు పెయింటింగ్ అని ఆదిమానవుడు ఉరుములకు మెరుపులకు భయపడి గుహాల్లో శక్తి ఆకారాన్ని గీసుకొని శరను పొందాడన్నారు. నాటి నుండి నేటివరకు చిత్రకళాఎన్నో రకాలుగా రూపాంతరం చెంది రకరకాల రాళ్లు పేపర్స్ క్యాన్వాస్ ప్రకృతిలో ప్రతి వస్తువు సంస్కృతులపై తన ఉనికిని చాటుకుందన్నారు.

ఆధునిక యుగంలో చిత్రకళ పెయింటింగ్ ప్రార్థన, గుళ్ళు, గోపురాలు, శిల్పాలు, అర్కిటెక్, డ్యాములు, ఇంజనీరింగ్, వైద్య, విద్య, వ్యాపార, సినిమా, ప్రెస్, చరిత్ర ప్రపంచ సంస్కృతి మొదలగు వాటిపై చిత్రకళ పెయింటింగ్ రేఖా రంగుల విన్యాస ప్రభావం ప్రతి రంగంపై పులుముకుందన్నారు. వరల్డ్ పెయింటింగ్ డే అందరి జీవితాలను కళావంతం చేయాలని, ఐక్యత శాంతి పెంపొందించాలని రుస్తుం ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్ర కారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Next Story