- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ థీమ్.. ప్రకృతిని కాపాడుకుందాం
దిశ, వెబ్ డెస్క్ : ప్రకృతిని ప్రేమిస్తే అది మానవవాళికి ఎంతగానో మేలు చేస్తుంది. కంటికి కనువిందు చేస్తూ విశ్వ మానవాళికి ఊపిరిపోసేవి వృక్షాలు. అలాంటి వృక్షాలు నరికేసి వాటి స్థానంలో పరిశ్రమలు నెలకొల్పడం వలన వాతావరణం కలుషితమై.. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అన్ని కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.
ప్రకృతిని గౌరవించి వాటికి హాని కలిగించనప్పుడే ప్రకృతి కూడా అంతే గౌరవిస్తూ మనకు కొండంత మేలు చేస్తుంది. కానీ ఉరుకుల పరుగులతో విశ్రాంతికి చోటు లేని జీవితంలో వాహన వేగం పెంచుతూ మనకి తెలియకుండానే ఇంధనకొరతకి, వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాము. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది. దీనివలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడువులను నరికివేయడం వలన జంతువులు జనారణ్యంలోకి రావడం లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలా పర్యావరణానికి ఆటకం కలిగించకుండా మనవంతుగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఎక్కువగా చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మానవుని జీవితం అనేది ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి.
పర్యావరణ దినోత్సవం…
ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్యలక్ష్యం పర్యావరణాన్ని పరిరక్షిచాల్సిన అవసరం ప్రజలలో అవగాహన కల్పించడం. మొదటి సారిగా 1972 జూన్ 5 వ తేదిన ప్రపంచ పర్యావరన దినోత్సవంగా జరుపుకున్నారు. ఆ తర్వాత 1974లో ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా ప్రతిసారీ ఒక్కో థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు. ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. “Reimagine. Recreate. Restore” పునరాలోచించు.. పున:సృష్టించు.. పునరుద్ధరించు.. ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ’ అనేది 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి థీమ్.