సింగరేణి గనిలో అధికారిపై దాడి.. చంపేస్తానని బెదిరింపులు

by Sridhar Babu |
సింగరేణి గనిలో అధికారిపై దాడి.. చంపేస్తానని బెదిరింపులు
X

దిశ, గోదావరిఖని: సింగరేణిలో ఓ అధికారిపై జరిగిన దాడి ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 2ఏ గనిలో ఓర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్‎పై అదే గనిలో జనరల్ మజ్జుర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అనే కార్మికుడు కొంతమందితో కలిసి దాడి చేశాడు. గనిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు కార్మికుడికి ఓర్మన్ సంతోష్.. ఎక్కువగా పని చేయిస్తున్నాడనే కోపంతో కొంతమందితో కలిసి ఓసీపీ వద్ద మాటువేసి దాడికి దిగారు. దీంతో ఈ ఘటన సింగరేణిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దాడిని నిరసిస్తూ ఓర్మన్ సంతోష్‌తో పాటు మరికొంత మంది ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అంతే కాకుండా సదరు కార్మికుడు తనను చంపేస్తానంటూ ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఓర్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు.


Next Story