‘మహిళలు లేని సమాజాన్ని ఊహించుకోగలమా’

by  |
‘మహిళలు లేని సమాజాన్ని ఊహించుకోగలమా’
X

దిశ, ఆదిలాబాద్: మహిళలు లేని సమాజాన్ని ఊహించుకోగలమా… అని నిర్మల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మహిళ స్థానం అత్యున్నతమైన దన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి మొదలుకొని నౌకాయానం, ఆకాశయానం దాకా మహిళలు ఎక్కడా తీసిపోకుండా సమాజంలో తమ పాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు మరింత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటే వారు మరింత ముందడుగు వేస్తారు.

tags : Womens Day, adilabad, PRTU, freedom,meeting

Next Story