షీ టీమ్‌ సేవలు మరింత విస్తరించాలి

by  |
షీ టీమ్‌ సేవలు మరింత విస్తరించాలి
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: షీ టీమ్ సేవలను మారుమూల గ్రామాలకు విస్తరించాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాత్రి లక్రా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యూనిట్లకు మూడ్రోజుల ఆన్‌లైన్ శిక్షణను సోమవారం ప్రారంభించారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, తమ సమస్యలను షీ టీమ్‌లకు చెప్పుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఉమెన్ సేఫ్టీ డీఐజీ సుమతి మాట్లాడుతూ షీ టీమ్‌లు ఏర్పాటైన 2014 నుంచి ఫిర్యాదులు చేసేందుకు బాధితులు ముందుకొస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యాంకర్ సుమ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్ జిల్లాల పోలీసు అధికారులు సుమారు 400 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి ప్రత్యేక బ్రోచర్ ను ఆవిష్కరించారు.


Next Story