- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెన్నాళ్లీ దుస్థితి.. ఖాళీ బిందెలతో నిరసన
దిశ, మెదక్: మెదక్ జిల్లా కౌడిపల్లిలోని కొత్తచెరువు తండాలో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తండావాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నెలరోజులుగా నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నామని, నమస్య పరిష్కరించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలోని బోరు పాడవటంతో నీటి సమస్య తలెత్తిందన్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారని, ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం జక్కనపేట గ్రామంలోనూ మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ నీరు ఇంకా రావడం లేదని విమర్శించారు. గ్రామ ప్రజలందరూ మంచినీరు ట్యాంక్ వద్ద నుంచి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అని అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇంటింటికీ నల్ల నీళ్లు అందించేలా కృషి చేయాలని కోరారు.