- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ పోర్టులో ఫ్రీగా ‘వోడ్కా’ షాట్స్.. రచ్చ చేసిన మహిళా ప్యాసింజర్స్ (వైరల్)
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ఎయిర్ పోర్టులో మద్యపానం నిషేధం. కానీ ఫ్లైయిట్ టేక్ ఆఫ్ అయ్యాక విమాన సిబ్బంది ప్యాసింజర్స్‌కు మద్యాన్ని సప్లయ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామికి చెందిన ఇద్దరు మహిళలు ఎయిర్ పోర్టులో లగేజ్ చెక్ ఇన్ టైంలో క్యూలో నిల్చున్న ప్యాసింజర్స్‌కు ఫ్రీగా వోడ్కా షాట్స్ పంపిణీ చేశారు. అక్కడున్న వారంతా మొదట షాక్ అయినా, ఫ్రీగా వస్తుంది కదా అని అందరూ తాగేశారు. అయితే, ఈ మహిళా ప్యాసింజర్స్ ఇలా ఎందుకు చేశారని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వీరు కస్టమ్స్ సెక్యూరిటీ నిబంధనల కంటే ఎక్కువ మోతాదులో మద్యం బాటిళ్లను క్యారీ చేస్తున్నందున అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో వారు లగేజ్ చెక్ ఇన్ వద్ద క్యూలో నిలబడి ఉన్న తోటి ప్రయాణికులకు ఫ్రీగా ‘వోడ్కా షాట్స్’ పంపిణీ చేశారు.ఈ దృశ్యాలను టిక్‌టాక్ యూజర్ ‘లాటిన్ బెల్లా’ తన మొబైల్‌లో షూట్ చేసి ఆన్‌లైన్‌లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. అనతి కాలంలోనే 12.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.8 మిలియన్ లైక్స్ కూడా రావడంతో లాటిన్ బెల్లా ఆనందం వ్యక్తం చేశారు.