అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

దిశ, మునుగోడు:

తన కూతురి సంతోషం కోసం నచ్చిన వాడితో పెళ్లి జరిపించాడు తండ్రి. ఇక తన కూతురి జీవితం కలకాలం సంతోషంగా సాగుతుందని ఆశపడ్డారు. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అదనపు కట్నం కోసం తన కూతురు బలైంది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల మండల పరిధిలోని అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన మోడెపు సురేష్, బొంగు పూజ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గతేడాది పెద్దలను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో పూజకు కట్నం కింద బంగారం, సుమారు రూ. 7 లక్షలు అందించారు. కొన్ని రోజులు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ తర్వాత భర్త సురేష్, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తీసుకురావాలని పూజను వేధించసాగారు. మంగళవారం నాడు ఇదే విషయంపై గొడవ జరిగి పూజను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి బొంగు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ వెంకన్న తెలిపారు.

Advertisement