ఏసీబీ వలలో మహిళా వీఆర్వో..

by  |
ఏసీబీ వలలో మహిళా వీఆర్వో..
X

దిశ‌, కొత్త‌గూడెం :
కళ్యాణలక్ష్మీ చెక్కు ఇవ్వాంటే రూ.10వేలు లంచం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాల్వంచ మండ‌లం కిన్నెరసాని వీఆర్వో ప‌ద్మ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడింది.వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన రాజేశ్వరికి గత కొద్దిరోజులగా క‌ళ్యాణ‌ ల‌క్ష్మీ కింద మంజూరైన చెక్కు కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. వీఆర్వో మాత్రం చెక్కును తన దగ్గర పెట్టుకుని రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. రూ.5వేలు ఇస్తాన‌ని చెప్పినా విన‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. విష‌యం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన‌ గుమ్మడి నాగమణితో క‌ల‌సి రాజేశ్వ‌రి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగ‌ళ‌వారం పథకం ప్రకారం రూ.7వేల న‌గ‌దును రాజేశ్వరి స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో ప‌ద్మ‌కు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారి మధుసూదనరాజు త‌న బృందంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story