ఉరేసుకుని మహిళ ఆత్మహత్య.. కారణం ఇదే!

దిశ, వెబ్‌డెస్క్ :

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వివాహం జరిగి 12 ఏళ్లయినా సంతానం కలుగలేదనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని పటాన్​ చెరు మండలం నందిగామ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే మహిళకు బీరంగూడకు చెందిన కుమార్​తో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే, నాటి నుంచి సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలుగకపోవడంతో మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్​పూర్​ పోలీసులు తెలిపారు.

Advertisement