గిన్నిస్ రికార్డును కత్తిరించిన మహిళ

by Sujitha Rachapalli |
గిన్నిస్ రికార్డును కత్తిరించిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : గుంపులో గోవిందలా కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఓ మహిళ.. పొడవాటి గోర్లు పెంచుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇప్పుడు ఆ మహిళే.. గిన్నిస్ రికార్డుకు కారణమైన తన వేలి గోర్లను కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన అయానా విలియమ్స్.. 1979 నుంచి తను గోర్లు పెంచుకుంటోంది. దాదాపు 8 సెంటిమీటర్ల వరకు పెరిగిన గోర్లను డిఫరెంట్ పాలిష్‌తో అలంకరించుకునేది. ఈ క్రమంలోనే 2017లో ప్రపంచ రికార్డు సైతం అందుకుంది.

అయితే ప్రస్తుతం మాత్రం ప్రాక్టికల్ స్టైల్ అవసరమంటున్న అయానా.. ఈ గోర్లు తనకు అవసరం లేదనిపిస్తున్నందునే కత్తిరించుకున్నానని చెప్పింది. ఇక తన నెయిల్స్(ప్రస్తుతం 733.35 సెంటిమీటర్లు) కోల్పోయినప్పటికీ తాను క్వీన్ అనే చెప్తోంది. కాగా ఈ గోర్లను ఫ్లోరిడాలోని మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed