సంచలనంగా మారిన మహిళా SI సూసైడ్.. హాస్టల్ గదిలో అలా..

by Sumithra |   ( Updated:2021-08-29 01:04:53.0  )
సంచలనంగా మారిన మహిళా SI సూసైడ్.. హాస్టల్ గదిలో అలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై భవానీ ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం‌కు చెందిన భవానీ పోలీసు కొలువు కోసం కష్టపడి చదివి ఎస్సైగా జాబ్ సంపాదించింది. అయితే గత వారం రోజుల క్రితం ట్రైనింగ్ కోసమని విజయనగరం వెళ్లిన భవానీ హాస్ట‌ల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed