ఇన్‌స్పైరింగ్ స్టోరీ.. టీచర్‌గా ఇడ్లీవాలా డాటర్

by Shyam |
ఇన్‌స్పైరింగ్ స్టోరీ.. టీచర్‌గా ఇడ్లీవాలా డాటర్
X

దిశ, ఫీచర్స్ : చదువు మూడో నేత్రం అంటారు పెద్దలు. మంచిగా చదువుకుంటే జీవితాలు మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదని కాళోజీ అన్నారు. ఉపాధ్యాయుడి వాక్కు శక్తి అనంతమైంది. అమ్మ ఒడి నుంచి బడికి చేరిన విద్యార్థికి అక్షరాలు, పాఠాలు నేర్పించే గురువు పాత్ర మరవలేనిది. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఆచార్యుడి పాత్ర వెలకట్టలేనిది. ఆదియుగానికి నేటి కలియుగానికి విద్యావిధానం చాలా మారిపోయింది కానీ గురువుల పాత్ర మాత్రం ఏమి తగ్గలేదు. గురువులు నేర్పించిన అక్షరాలే, వారికి ప్రాపంచిక జ్ఞానాన్ని అందించడంతో పాటు, ఉద్యోగావకాశాలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయి. ఇక తమ విద్యార్థులు జీవితంలో స్థిరపడితే ఆ గురువుల ఆనందం మాటల్లో వెలకట్టలేం. అలా ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థి విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్త వైరల్‌ అయింది.

‘వెరీ గుడ్‌న్యూస్.. ముంబైలోని మన్‌ఖుర్డ్‌లో నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తు్న్న సమయంలో..గ్రేడ్ 5 చిన్నారికి పాఠాలు చెప్పాను. ఆమె తల్లి రోడ్‌సైడ్ ఇడ్లీ విక్రేత. బాగా చదువుతున్నా.. తన కూతురిని పాఠశాల మాన్పించాలనుకుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం చదువుకోవాలనుకుంది. పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించడమే కాదు.. ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. అయితే ఆమె ఓ పాఠశాలలో చేరబోతుంది. ఈ సందర్భంగా నా రిఫరెన్స్ అడిగింది. అఫ్‌కోర్స్ సంతోషంగా ఇస్తానని చెప్పాను’ అని తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది ఆ టీచర్. ప్రస్తుతం తను అహ్మదాబాద్‌లో ఉంటుండగా, కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ముంబైకి వచ్చి కలుస్తానని శిష్యురాలికి హామీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed