బుల్లి ఉడుతకు లైఫ్, లవర్‌ను సెట్ చేసిన జెస్సిక

by Anukaran |   ( Updated:2021-04-01 08:37:18.0  )
బుల్లి ఉడుతకు లైఫ్, లవర్‌ను సెట్ చేసిన జెస్సిక
X

దిశ, ఫీచర్స్ : కొడుకును స్కూల్‌ నుంచి తీసుకొస్తున్న తల్లి రోడ్డు పక్కన నడుస్తోంది. అప్పుడే పెద్ద గాలి దుమారం.. చూస్తుండగానే చెట్టుమీద నుంచి కిందపడ్డ కనీసం కళ్లు కూడా తెరవని ఓ ఉడుత… చుట్టుపక్కల కనిపించని తల్లి.. ఆ చిట్టి ఉడుతను కాసేపు అలాగే వదిలేస్తే, చీమలు తినడం ఖాయం.. అలాంటి టైమ్‌లో ఎవరైనా సరే, పాపం అని జాలి చూపించి తమ దారి తాము చూసుకుంటారు. కానీ జెస్సికా ఆడమ్స్ అలా చేయలేదు. ఆ ఉడుతును ఇంటికి తీసుకెళ్లి ఎలాగైనా బ్రతికించాలనుకుంది. అసలు అంత చిన్న ఉడుత పిల్లకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో.. లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయింది. కేవలం 1.3 ఔన్స్ బరువున్న ఆ చిన్న జీవి ప్రాణం కోసం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపింది.

ఉడుత పిల్లను ఫీడ్ చేసేందుకు ఓ చిన్న గొట్టాన్ని తయారు చేసిన జెస్సిక.. రాత్రి ప్రతీ రెండు గంటలకోసారి పాలు తాగించింది. నిద్రపోతే ఉడుత చనిపోతుందనే డభయంతో అలారం సెట్ చేసుకుని మరీ.. రాత్రంతా ఫీడ్ చేసింది. ఈ సమయంలో హెల్ప్ కోసం అడవి జంతువుల సంరక్షణ కేంద్రానికి ఫోన్ చేసినా, ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయని తాము రాలేమని చెప్పడంతో.. తనే స్పెషల్ కేర్ తీసుకుంది. ఏదైతేనేం.. ఆ బుల్లి బుడత ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇలాగే ఫుడ్ ఇస్తే ఉడుత బతుకుందని జెస్సికాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే దానికి ప్రతీ రెండు గంటలకోసారి దానికి ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, జెస్సికా ఆఫీస్‌కు వెళ్లినా సరే దాన్ని ఓ షూ బాక్స్‌లో తీసుకుని వెళ్లేదట. ప్రతీరోజు దాని వెయిట్ చూడడం, బరువు పెరిగిన కొద్దీ జెస్సికాలో ఓ తల్లి పడే ఆనందం కనబడింది. ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా షేర్ చేసిన జెస్సిక.. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో జెస్సికా, బుల్లి ఉడుతల స్టోరీ వైరల్ అయింది.

ఫిబ్రవరి 25, 2019లో దొరికిన ఈ బుల్లి ఉడుతకు తల్లిగా మారిన జెస్సిక.. తనకు స్టీవెన్ జెఫరీ ఆడమ్స్(స్టీవ్) అని పేరు పెట్టుకుంది. స్టీవ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యాక.. బ్యాక్ యార్డ్‌లో ఓ బుల్లి ఇల్లు కూడా కట్టించి, తోటలో ఇతర ఉడుతలు ఎలా చెట్లు ఎక్కుతాయో, ఎలా ఆడుకుంటాయో అలాగే చేయాలని సూచించిందట జెస్సిక. దీంతో ఆ ఉడుత కూడా అలాగే చేయడం, ఈ క్రమంలో ఫ్రెండ్స్ కూడా ఎక్కువ కావడంతో.. ఒక రోజు బయట ప్రపంచాన్ని చూడాలనే కోరికతో వెళ్లిపోయిందట. ఇక స్టీవ్ రాదేమో అనుకుంటుండగా, ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగివచ్చిందట. తనకు పెట్టిన ఫుడ్‌ స్నేహితులకు కూడా షేర్ చేసి ఆడుకుంటుందట. అంతేకాదు ప్రస్తుతం జోలీన్ అనే గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఔట్ సైడ్ వరల్డ్‌ను ఎంజాయ్ చేస్తోందని చెప్పుకొచ్చింది జెస్సిక.

Advertisement

Next Story

Most Viewed